చీరాల : పెట్రోలు ధరల పెంపకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో పట్టణంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఆర్‌టిసీ రవాణా బంద్ చేశారు. పట్టణంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బస్టాండు వద్ద బస్సులను నిలిపేసిన అనంతరం పట్టణంలో ర్యాలి నిర్వహించారు. దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూయించారు. బంద్‌లో పాల్గొన్న ఆందోళన కారులను నియంత్రించేందుకు బస్టాండు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులూ చేరుకున్నారు. అయితే బంద్‌కు ప్రజలనుండి నైతిక మద్దతు ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, నాయకులు సయ్యద్ అలీమ్‌బాబు, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, నాయకులు కందుకూరి యల్లమంద, డాకా నారపరెడ్డి, దేవతోటి నాగేశ్వరరావు, ఐఎల్‌టిడి నాయకులు ఎం రవిచంద్ర, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, ఎ బాబురావు, జనసేన కన్వీనర్ గూడూరు శివరామప్రసాద్ పాల్గొన్నారు.