Home ఆంధ్రప్రదేశ్ బిజెపి హటావో… ఎ.పి  బచావో : దాసరి రాజా మాష్టారు

బిజెపి హటావో… ఎ.పి  బచావో : దాసరి రాజా మాష్టారు

409
0

కందుకూరు : నిన్న మొన్నటి వరకు టిడిపితో కలసి ప్రయాణం చేసి ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం టిడిపిని, చంద్రబాబును, ఆంధ్ర రాష్ట్రాన్ని నష్ట పరచడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని టిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి రాజా మాస్టార్ అన్నారు. ఇలాంటి తరుణంలో బిజెపి హటావో, ఎపి బచావో నినాదాన్ని దేశం మొత్తం తెలిసేలా ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని  కోరారు. స్థానిక తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరంలో 161 వ బాచ్ ప్రారంభ కార్యక్రమంలో హాజరైన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

బిజెపితో కలసి కపట నాటకాలు ఆడుతున్న జగన్ పార్టీ, జనసేన పార్టీలు రెండింటిని రాష్ట్ర  ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నిర్దేశం ప్రకారం పార్లమెంట్ సభ్యులు లోక్ సభలో అవిశ్వాస తీర్మాన నోటీసుని ఇస్తున్నప్పుడు, రాజ్యాంగం ప్రకారం నడచుకోవలసిన సభాపతి ప్రధాని మోడీ ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటూ సభ ఆర్డర్ లో లేదని నోటీసును తీసుకోకుండా ఉండడం ఎంతవరకు సబబు అని రాజా మాష్టారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం నేడు అన్నిరాజకీయ పార్టీలతో కలసి రహదారుల నిర్భంద కార్యక్రమాన్ని నిర్వహించడం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా బిజెపి, కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యాన్ని ప్రజలలోకి తీసుకెల్లాలన్నారు. విభజన హామీల అమలు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉద్యమానికి సిద్దంగా ఉన్నారనే సంకేతాన్ని కేంద్రానికి తెలియజేసేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమమన్నారు.

ఇదేవిధంగా చంద్రబాబు సూచనల మేరకు పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో పార్టీ యంత్రాంగం అంత తప్పనిసరిగా పాల్గొనాలని రాజా మాష్టారు సుసించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బూస్థాపితం చేస్తే, ప్రస్తుతం బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ తన గొయ్యి తనే తవ్వుకుంటుందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ బిజెపి హటావో, ఎపి బచావో నినాదంతో తెలుగు ప్రజలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని రాజా మాష్టారు అన్నారు.  రాబోయే ఎన్నికలలో ప్రజలు బిజెపికి తగినబుద్ది చెప్తారని రాజా మాష్టారు అన్నారు.  ఈ శిక్షణకు  ప్రకాశం జిల్లా దర్శి , కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లా గూడూరు నియోజక వర్గ గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్, కో ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, శిక్షకులు పసుపులేటి పాపారావు, చైతన్య  పాల్గొన్నారు.