Home ఆంధ్రప్రదేశ్ షాకింగ్ న్యూస్ : దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం!

షాకింగ్ న్యూస్ : దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం!

406
0

హైదరాబాద్ :  మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు తీర్చలేని విషాదం ఎదురైంది.  ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుడు 21 ఏళ్ల వైష్ణవ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊహించని ఘటనతో దత్తన్న షాక్ కు గురయ్యారు.

వెంటనే వైష్ణవ్ ను ఆసుపత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి 10.45 గంటల సమయంలో రాత్రివేళ భోజనం చేస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే.. ముషిరాబాద్ లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ చిన్న వయసులోనే గుండెపోటుకు గురి కావటం, నిమిషాల వ్యవధిలోనూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం దత్తన్న కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. వైష్ణవ్ ను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించిన వైద్యులు.. చివరకు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు.

ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లే పరిస్థితి రావటం దత్తన్న ఫ్యామిలీ షాక్ కు గురి చేసింది.

ఇటీవల కాలంలో చిన్న వయస్కులు గుండెపోటుకు గురి కావటం ఎక్కువ అవుతోంది. కొడుకు హఠాన్మరణంతో తీరని షోకానికి గురైన దత్తన్న కుటుంబాన్ని పలువురు ప్రముఖులు, సన్నిహిత మిత్రులు కలిసి ఓదార్చారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.