Home క్రైమ్ మ‌రో ప్రేమ జంటపై కత్తితో దాడి

మ‌రో ప్రేమ జంటపై కత్తితో దాడి

659
0

హైదరాబాద్ : ఒక హ‌త్య ఘ‌ట‌న మ‌రువ‌కముందే మ‌రో ఘ‌ట‌న‌. వ‌రుస హ‌త్య‌ల‌తో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న ప‌రిణామాలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప‌రువుపేరుతో ద‌ళిత యువ‌కుడు ప్రణయ్‌ హత్యఘటనను మరువక ముందే హైదరాబాద్‌ నగరం ఎర్రగడ్డలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై ఎర్ర‌గ‌డ్డ గోకుల్ ధియేట‌ర్ వ‌ద్ద క‌త్తితో దాడి చేశారు. సందీప్‌, మాధవి అనే ఇద్ద‌రూ పెద్దలను ఎదురించి వారం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ వద్దకు వ‌చ్చారు. అదే స‌మ‌యంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. దాడిలో సందీప్‌ తీవ్రంగా గాయపడ్డాడు.మాధవికి చేయ్యి, మెడపై గాయాలయ్యాయి.

దాడి చేసిన‌ తర్వాత యువతిని దూషిస్తూ నిందితుడు పారిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ‌ దంపతులిద్ద‌రినీ సనత్‌ నగర్‌ నీలిమ ఆసుపత్రికి తరలించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. దాడికి మాధవి తండ్రే పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీల‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.