వేటపాలెం : మార్చి 8న ఆశా కార్యకర్తల సమస్యలపై జరిగే ఛలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు ప్రాంతీయ అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు కోరారు. వేటపాలెం పిహెచ్‌సి వద్ద జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సుజాత అధ్యక్షత వహించారు.
సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.6వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ విరమణ సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ల సాధన కోసం జరిగే ఛలో విజయవాడ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో సిఐటియు నాయకులు టంగుటూరి ప్రభాకరరావు, కోట మహాలక్ష్మి, జ్యోతి, హైమావతి, అనూరాధ, లిల్లీకుమారి పాల్గొన్నారు.