Home బాపట్ల బాలికోన్నత పాఠశాల వద్ద అన్నదానం

బాలికోన్నత పాఠశాల వద్ద అన్నదానం

6
0

చీరాల (DN5 News) : పట్టణంలోని కస్తూరిబా గాంధీ హై స్కూల్ ఆవరణలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఉగాది పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఉగాది పండుగ తోపాటు ‘నాని సమ్మర్ స్పెషల్ బాదాంపాలు’ దుకాణ యజమాని గజవల్లి శ్రీనివాసరావు తన మనవడు గజవల్లి యువరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం ఎంఎల్‌ఎ కొండయ్య ప్రారంభించారు. గత ఎనిమిదేళ్లుగా గజవల్లి శ్రీనివాసరావు కుటుంబం తమ ఇంట్లో శుభకార్యాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో పేదలు, భక్తులకు ఆనవాయితీగా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు భోజనాలు వడ్డించి వారితో ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.