ఆత్మకూరు : మున్సిపాలిటీ పరిధిలోని 13,14 వార్డులలో హౌసింగ్ ఫర్ ఆల్ పధకంలో భాగంగా (బిఎల్‌సి) ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి ఆనం రామనారాయణరెడ్డి అదేశాలమేరకు భూమిపూజ (శంకుస్థాపన) చేశారు. ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, మున్సిపల్ చైర్మన్ రాగి వనమ్మ, వైస్ ఛైర్మన్ టి చంద్రారెడ్డి, కమిషనర్ శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, ఎండి జమీల్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎం పెంచలరెడ్డి, శరత్, శీనయ్య, రసూల్, వివేక్, వార్డ్ అధ్యక్షులు సిహెచ్ హరిబాబు, రమణారెడ్డి, బషీర్, తిరుపాలు, మణి, పి వెంకటేశ్వర్లు, రవిమున్నా, సింహ యాదవ్, వెంకటేశ్వర్లు, శీనయ్య, ముసలయ్య, పెంచలయ్య, ప్రవీణ్, మాలకొండయ్య పాల్గొన్నారు.