Home ప్రకాశం ముక్కోడిపాలెంలో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ

ముక్కోడిపాలెంలో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ

260
0

కొండపి : ముక్కోడిపాలెం ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సన్నాహాలలో భాగంగా సోమవారం సాయంత్రం అంబేద్కర్ చిత్రపటాన్ని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, జనరల్ సెక్రటరీ లక్కెపోగు వెంకట్రావు, అంబేద్కర్ ఆశయ సమాజ్ రాష్ట్ర కన్వీనర్ దండేల కృష్ణ, ఎడిటర్ సాగర్, జె ఏడుకొండలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నాయకులు, అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థి, మేధావులు ముక్కోడిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముక్కోడిపాలెం నాయకులు దుగ్గిరాల వెంకటేశ్వర్లు, వై వసంతరావు, ఏకో నారాయణ, వై సిద్దయ్య, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బ్రహ్మానందం, కడియం బాలకృష్ణ, కట్టా శ్రీకాంత్, కట్టా శంకర్, కడియం బాలచంద్ర, కొండపి అంబేద్కర్ నగర్ కు చెందిన యువకులు పాల్గొన్నారు.