Home ప్రకాశం విజ్ఞాన యాత్రలో ఆల్టస్ విద్యార్థులు

విజ్ఞాన యాత్రలో ఆల్టస్ విద్యార్థులు

474
0

చీరాల : ఆల్టస్ విద్యార్థులు సోమవారం విజ్ఞాన యాత్రకు వెళ్లారు. చదువుతోపాటు విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ తేళ్ల అశోక్ కుమార్ తెలిపారు.

చారిత్రాత్మకమైన వేటపాలెం సారస్వతనికేతన గ్రంధాలయాన్ని సందర్షించారు. గ్రంధాలయం చరిత్ర తెలుసుకున్నారు. గ్రంధాలయంలో మహాత్మా గాంధీ వదిలి వెళ్ళిన చేతికర్ర, పురాతన గ్రంధాలు, పత్రికలు చూశారు.

క్రిస్టల్ సీ ఫుడ్స్ రొయ్యల పరిశ్రమలో కార్మికుల పనితీరు, రొయ్యల పరిశుభ్రత విధానం చూపించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి కదిరేషన్, అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ కావూరి మోహన్ చౌదరి, ప్లాంట్ ఇంచార్జ్ శ్యామ్, రాఘవమ్మ, ఫాట్రిక్, డేనియల్, దివ్య, మహాలక్ష్మి, వినీల, సుబ్బారావు, నాగలక్ష్మి, ప్రతాప్, ప్రవీణ్ పాల్గొన్నారు.