Home ప్రకాశం ఆరోగ్య రక్ష కు ప్రతి కుటుంబం అర్హులే

ఆరోగ్య రక్ష కు ప్రతి కుటుంబం అర్హులే

482
0

కందుకూరు : తెల్లరేషన్ కార్డు కలిగిన, చక్కర కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబం ఆరోగ్య రక్షకు అర్హులే నని డాక్టర్ యన్ టి ఆర్ వైద్యసేవ కందుకూరు డివిజన్ టీమ్ లీడర్ కందుల పీరారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు ఆరోగ్యరక్ష, ఉద్యోగస్తుల హెల్త్ కార్డ్స్, డాక్టర్ యన్ టి ఆర్ వైద్యసేవ పథకాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బి.పి, షుగరు, రక్తహీనత, ఊబకాయం యాంటీబయోటిక్స్ డాక్టర్ సలహా లేకుండా వాడటం వలన వచ్చు అనర్ధాల వంటి వాటిపై లఘు చలన చిత్రాల ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

పీరారెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రూ.1200/- మీసేవ కేంద్రాల యందు చెల్లించి ఆరోగ్య రక్ష కార్డు పొంది సంవత్సరానికి 1044 రకాల జబ్బులకు రూ.రెండు లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందవచ్చు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి హెల్త్ కార్డుల ద్వారా 25 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు రిమ్స్ నందు ఉచిత పరీక్షలు మరియు మందులు ఉచితంగా పొందవచ్చు అన్నారు. మిగతా 1885 రకాల చికిత్సలు మరియు శస్త్ర చికిత్సలు ప్రయివేటు వైద్యశాలల యందు ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చన్నారు. పై పథకాల పై సలహాలు, సూచనల కొరకు మరియు ఫిర్యాదులకొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల యందున్న వైద్య మిత్రలను లేదా హెల్ప్ లైన్ నంబర్ 104 ని సంప్రదించొచ్చన్నారు. ఈ కార్యక్రమమం లో ప్రధానోపాధ్యాయురాలు డి ఎల్ శ్యామల కుమారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.