చీరాల : చోరీ కేసుల్లో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి వారివద్దనుండి రూ.15.06లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు డిఎస్‌పి డాక్టర్ జి ప్రేమకాజల్ తెలిపారు. డిఎస్‌పి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. రూరల్ సిఐ వి భకర్తవత్సలరెడ్డి, ఎస్ఐ కమలాకర్‌కు అందిన సమాచారం మేరకు మన్నం అపార్ట్‌మెంట్ వద్ద ఉన్న దర్శిమండలం తిమ్మాయిపాలెం మోటుపల్లి సంగంకు చెందిన చేవూరి గంగయ్య, నంబూరి శ్రీను, చేవూరి అంకమ్మరావులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కారంచేడు మండలం పోతినేనివారిపాలెం, రంగప్పనాయుడువారిపాలెం, దగ్గుబాడు గ్రామాల్లో మూడు నేరాలు, వేటపాలెం స్టేషన్ పరిధిలో జాండ్రపేట, రావూరిపేట, రామన్నపేటల్లో నాలుగు నేరాలు, చీరాల 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని అవ్వారువారి వీధి, జక్కవారివీధి, ఐఎల్‌టిడి కాలనీ, శ్రీనివాసపురం, శాంతినగర్‌లలో మూడు నేరాలు, చిన్నగంజాం స్టేషన్ పరిధిలో మున్నంవారిపాలెం, సోపిరాల గ్రామాల్లో రెండు నేరాలు, ఇంకొల్లు స్టేషన్ పరిధిలో ఇంకొల్లు, ఈపూరుపాలెం స్టేషన్ పరిధిలో తోటవారిపాలెంలో చోరీ మొత్తం ఆరు స్టేషన్ల పరిధిలో 11చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
వీరిటతోపాటు నాలుగు చోట్ల దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 16నేరాల్లో ముగ్గురు ముద్దాయిలు 53సంవర్ల బంగారు ఆహరణాలు, 25కేజీల వెండి, రూ.69వేల నగదు మొత్తం రూ.15.06లక్షల విలువైన సొత్తు అపహరించినట్లు తెలిపారు. వీరి నుండి ఆ మొత్తం సొమ్ము స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న చేవూరి వెంకటరావు, అంకమ్మరావుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ బక్తవత్సలరెడ్డి, ఎస్ఐ కె కమలాకర్, సిసిఎస్ హెచ్‌సి పిల్లి రవి, కానిస్టేబుల్ ప్రసాదు, బాబు, టి శ్రీను, అచ్చయ్య, విద్యాసాగర్, వెంకటరావు, రవిరెడ్డి, రఉఫ్‌లకు రివార్డులు ప్రకటించారు.