Home ప్రకాశం వైసిపి నాయకులు డేవిడ్ రాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, ఉపాధి కూలీలకు మాస్క్ లు...

వైసిపి నాయకులు డేవిడ్ రాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, ఉపాధి కూలీలకు మాస్క్ లు పంపిణీ

330
0

టంగుటూరు : కరోనాతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వైస్సార్ సీపీ నాయకులు తేళ్ల డేవిడ్ రాజు ఆధ్వర్యంలో వైస్సార్ సీపీ మండల నాయకులు, సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు చేతుల మీదుగా పంచాయతీ కార్యాలయం వద్ద బియ్యం పంపణీ చేశారు. 75మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 20కేజీల నాణ్యమైన బియ్యం అందజేశారు.

అలాగే గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న 500మంది కూలీలకు పనులు జరిగే చోటుకు వెళ్లి మాస్క్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, మాజీ జడ్పీటీసీ పటాపంజుల కోటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పుట్టా వెంకటరావు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, వైసీపీ నాయకులు పమిడి హరికృష్ణ, తుల్లిబిల్లి అశోక్, ఎంపీటీసీ అభ్యర్థి దేవరపల్లి వరుణ్, నత్తల క్రాంతి, దండాల వినోద్, సూదనగుంట వెంకటస్వామి, ల్యాబ్ రమణయ్య, చిన్న వీరనారాయణ, రవీంద్ర, ప్రభుదాస్, అలెగ్జాండర్, ఎస్కె మౌలాలి, వెంకటేష్, సుబ్బారావు, డి సుబ్బారావు, అనిల్ పాల్గొన్నారు.