కొండపి : మండలంలోని గుర్రపడియ వద్ద గల అట్లేరు వాగులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గ్రామస్తుల ద్వారా అందిన సమాచారం మేరకు ఎఎస్ఐ హనుమంతరావు తన సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ ఎన్ సి ప్రసాద్ తెలిపారు. అట్లేరువాగులో ఇసుక నింపుకుని వస్తున్నా 2టిప్పర్లను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఇసుకను తరలించడానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏపీ27యుబి6667, ఏపీ31టిబి8832 టిప్పర్ల డ్రైవర్లు పాలపర్తి వేంకటేశ్వర్లు, పొత్తూరి వెంకటేశ్వర్లతో పాటుగా టిప్పర్ల యజమాని కామిరెడ్డి కొండారెడ్డి, గుర్రపడియ గ్రామంకి చెందిన మారెడ్డి వెంకటసుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసి 2 టిప్పర్ లను సీజ్ చేసినట్లు కొండపి ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తెలిపారు.