Home ఆంధ్రప్రదేశ్ కందులు, మినుములు, శనగలు మార్కుఫెడ్ ద్వారా కొంటాం : మంత్రి ఆదినారాయణరెడ్డి

కందులు, మినుములు, శనగలు మార్కుఫెడ్ ద్వారా కొంటాం : మంత్రి ఆదినారాయణరెడ్డి

374
0

అమరావతి : రాష్ట్రంలో అపరాల రైతుల ఇబ్బందులు గమనించి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించే విధంగా చర్యలు తీసుకొంటున్నట్లు మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖా మంత్రి సి ఆదినారాయణరెడ్డి శుక్రవారం సచివాలయంలో ప్రకటించారు. కందులు, మినుములు, శెనగలు పండించిన ఒక్కొక్క‌ రైతు నుండి 25 క్వింటాళ్లు మార్కుఫెడ్ కొనుగోలు చేసేలా ప్రభుత్యం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కొనుగోళ్లు ఏప్రిల్ 15 వరకు కొనసాగేలా ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ పంటకు సంభందం లేకుండా కొనుగోళ్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. కొనుగోళ్లకు నిర్ణయించిన గడువును అవసరాన్ని బట్టి సమీక్షించి పొడిగిస్తామ‌న్నారు. ప్రభుత్యం రైతుల పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్ర‌భుత్వం ఉందని స్పష్టం చేశారు. రైతు సమస్య ఏదైనా ప్రభుత్యం పరిష్కారానికి ముందుంటుందని చెప్పారు