Home సినిమా ప్రేమించిన అమ్మాయితో హీరో నిఖిల్ నిశ్చితార్థం

ప్రేమించిన అమ్మాయితో హీరో నిఖిల్ నిశ్చితార్థం

237
0

యంగ్ హీరో నిఖిల్.. త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన అమ్మాయి‌కి ఆయన గోవాలో ప్రపొజ్ చేసి ఒప్పించాడు. అంతేకాదు ఇరుకుటుంబాల పెద్దల్ని కూడా మెప్పించాడు. నిఖిల్ ఎక్కడైతే ప్రపొజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 1న (శనివారం) నిఖిల్, పల్లవి నిశ్చితార్థం జరిగింది. పల్లవి వర్మను ఏప్రిల్ 16న నిఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు. డాక్టర్ పల్లవికి నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా నిఖిల్ తాజాగా ‘కార్తికేయ-2’లో నటిస్తున్నాడు. ‘హ్యాపీడేస్‘ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన నిఖిల్ అనతికాలంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో ఈ యంగ్ హీరో హిట్లు అందుకున్నారు.