Home క్రైమ్ కుక్కకాటుకూ మందు కరువే

కుక్కకాటుకూ మందు కరువే

398
0

– ప్రభుత్వ వైద్యశాలలో దుస్తితి
– ప్రవేటు వైద్యశాలను ఆశ్రయించిన పేదలు
చీరాల : వేటపాలెం రైల్వే స్టేషన్‌ సమీపంలోని నివాసం ఉంటున్న బాలుడు అంగనవాడీ పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా కుక్క దాడి చేసింది. చెంపలపై కరిచింది. కుక్క కాట్లకు రక్త గాయాలు అయ్యాయి. తల్లి దండ్రులు వెంటనే చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యుశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తమవద్ద ఎఆర్‌వి వ్యాక్సిన్‌ లేదని చెప్పారు. కుక్కకాట్లుతో వచ్చే రోగులు ఎక్కవైనందున అయిపోయిందని చెప్పారు. ఒంగోలు రిమ్స్‌కు వెళితే ఉండవచ్చని బదులు ఇచ్చారు. అదీ నమ్మకం లేదన్నారు. వైద్యుల మాట్లో ప్రభుత్వ వైద్యశాలకు ఎక్కడికెళ్లినా వ్యాక్సిన్‌ ఉండదని అర్ధమయ్యేలా చెప్పారు. కొద్దిసేపు ఆందోళనపడ్డ బాధితులు చివరకు ప్రవేటు వైద్యశాలలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకుని వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. కుక్క కాటుకు కూడా సూదిమందు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.