Home వైద్యం శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి ఆధ్వర్యంలో వాడరేవులో ఉచిత షుగరు వైద్య శిబిరం

శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి ఆధ్వర్యంలో వాడరేవులో ఉచిత షుగరు వైద్య శిబిరం

347
0

చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగరు వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతినెలా నాలుగో ఆదివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరం ఈ నెల 24న నిర్వహించారు. శిబిరంలో 1252మందికి వైద్య పరీక్షలు చేసి రెండునెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. రోగులు దూరప్రాంతాల నుండి వేకువజామునే ఆశ్రమంకు చేరుకున్నారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసిన అనంతరం అల్పాహారం అదించారు. డాక్టర్ రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు చేశారు. ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్, ఏ సురేష్, ఎంజి శంకరరావు, పి కామేశ్వరరావు ఏర్పాట్లు చేశారు. జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు సేవలందించారు.