Home ఆంధ్రప్రదేశ్ జ‌గ‌న్ పాద‌యాత్ర రూట్ ప‌రిశీల‌న‌

జ‌గ‌న్ పాద‌యాత్ర రూట్ ప‌రిశీల‌న‌

456
0

చీరాల : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంకల్ప‌యాత్ర సాగే రూటును బాప‌ట్ల పార్లమెంట్ వైసిపి ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చీరాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి య‌డం బాలాజీతో క‌లిసి ప‌ర్య‌టించారు. రావూరులో 8రాత్రికి బ‌స‌చేసిన జ‌గ‌న్ 9న హైద‌రాబాద్ వెళ్లి వ‌చ్చిన అనంత‌రం 10న రావూరు నుండి చీరాల బేరుపేట వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు.

10న రాత్రికి అక్క‌డే బ‌స చేస్తార‌ని పేర్కొన్నారు. 11న ఉద‌యం చీరాల ప‌ట్ట‌ణం గ‌డియార స్థంభం సెంట‌ర్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతార‌ని పేర్కొన్నారు. అక్క‌డి నుండి ఈపూరుపాలెం మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేసిస్తార‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రిగే రూటు, ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వీరివెంట వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, మాజీ ఎంపి చిమ‌ట సాంబు ఉన్నారు.