Home ఆంధ్రప్రదేశ్ నకరికల్లు లో క్షుద్రపూజలు భయాందోళనలో ప్రజలు

నకరికల్లు లో క్షుద్రపూజలు భయాందోళనలో ప్రజలు

574
0

గుంటూరు : నకరికల్లు మండల కేంద్రము నకరికల్లు శివారు గ్రామమైన శ్రీరాంపురం వద్ద ఆదివారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అమావాస్య కావటం వలన శ్రీరాంపురం వద్ద అడవి ప్రాంతమైన కొండ రోడ్డులో రంగు ముగ్గులు, పసుపు కుంకుమ, నల్లటిఅన్నం, నల్ల కోళ్ళు రోడ్డు పక్కల కనిపించేసరికి గ్రామప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

ఉదయాన్నే బహిర్భూమికి, పొలాలకు వెళ్లేవాళ్లు క్షుద్రపూజలు జరగడం చూసి గ్రామంలో తెలపడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని, పొలం పనులకు రాత్రివేళల్లో కూడా వెళుతుంటామని కనుక ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.