ఓపెరా హౌస్(సిడ్ని) : ఆస్ట్రేలియా రాజధాని నగరం సిడ్నీలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యకే హోదా కల్పించాలని కోరుతూ అక్కడి హోమ్ బుష్ ప్లాజా వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. స్టార్ ఫీల్డ్ సర్కిల్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్లేకార్డులతో ప్రదర్శన చేశారు.
చట్టబద్దంగా ఆంద్రప్రదేశ్‌కు చెందాల్సిన హక్కులు అమలు చేయాలని, నిధులు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో తెలుగు విద్యార్ధులు ఈదర రాజశేఖర్, జాలాది అఖిల్, నాగేంద్రబాబు, తలపనేని కృష్ణ, మల్లిఖార్జున్, మందాడి వినయ్, లక్ష్మణ్, మహేష్, రాజా పాల్గొన్నారు.