Home ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచితంగా బోర్లు : మంత్రివర్గంలో చర్చ

రైతులకు ఉచితంగా బోర్లు : మంత్రివర్గంలో చర్చ

324
0

– తృణ ధాన్యాల ప్రోత్సాహకానికి మిల్లెట్ బోర్డు ఏర్పాటు – స్వయం ఉపాధి రుణాల గడువును ఈ నెల 31ని పొడిగించే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై మంత్రులు చర్చిస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ భరోసా కింద రైతులకు ఉచితంగా బోరు బావులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మిల్లెట్‌బోర్డు ఏర్పాటు, వైఎస్సార్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచారు. దీన్ని ర్యాటిఫై చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్థిక సహకార సంస్థల ద్వారా స్వయం ఉపాధి కోసం ఇచ్చే రుణాల కోసం దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. ఈ గడువు పెంపు, సాయానికి సంబంధించిన అంశాలనూ మంత్రిమండలి ముందుంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.