Home ఆంధ్రప్రదేశ్ పిడిఎస్ బియ్యం గోడౌన్లో తనిఖీలు

పిడిఎస్ బియ్యం గోడౌన్లో తనిఖీలు

375
0

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న పిడిఎస్ బియ్యాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డా కె మాధవిలత పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్న ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మిల్లర్లకు, ప్రభుత్వానికి నష్టం లేకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశం ఉందన్నారు. జిల్లాలో 8 గోడౌన్లలో 85వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నాయని తెలిపారు. నిల్వలు ఎలా చేస్తున్నారు, ఏప్రిల్, మేలలో పంపిణీ చేసే వరకు నిల్వ చేసే విధానంతో ఏమైనా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నదానిపై పరిశీలిస్తున్నామని చెప్పారు. 1000 శ్యాంపిళ్ళు ర్యాండమ్ గా తీసి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గోడౌన్లలో నిల్వలు ఉన్న బియ్యంలో బ్రోకెన్ రైస్, డిస్ క్లరేషన్ ఎంత శాతం ఉన్నదో పరీక్షలు చేసి సివిల్ సప్లైస్ కమీషనర్ నివేదిస్తామన్నారు.