Home ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఆచారం… హిందు ధ్రువీకరణ : చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

క్రైస్తవ ఆచారం… హిందు ధ్రువీకరణ : చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

529
0

అమరావతి : “ఆచార వ్యవహారాలు క్రైస్తవ మతం. చదువు, రాజకీయాలకు సంభందించిన ధ్రువీకరణ పత్రాలు హిందు సాంప్రదాయం ప్రకారం ఎస్సీలగానే ఉంటున్నారు. ఇది ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒక్కరే కాదు. అత్యధిక మంది దళితుల్లో ఉన్న సాంప్రదాయం. అందుకే గత ఎన్నికల్లో దళిత క్రైస్తవులు ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు.”

తాజాగా రాజధాని ప్రాంతమైన తాడికొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన వైసిపి నేత ఉండవల్లి శ్రీదేవికి ఇప్పుడు అదే చిక్కు ఎదురైంది. తుళ్లూరు మండలం పరిధిలో జరిగిన వినాయక ఉత్సవాల్లో తనను అవమానించారని పోలీసులకు పిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఈ అరెస్ట్ తతంగం పూర్తికాగానే శ్రీదేవి చెప్పిన విషయం ఇప్పుడు తనను చిక్కుల్లో పడేసేలా ఉంది. ఈ వివాదాస్పద అంశం ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే పదవికే ఎసరు తెచ్చేలా కనపడుతుంది. తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవాడని శ్రీదేవి చెప్పారు. అక్కడే సమస్య మొదలయ్యింది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి శ్రీదేవి గెలుపొందారు. ఎవరైనా దళితులు మతం మార్చుకుంటే చట్టప్రకారం వచ్చే రిజర్వేషన్లను కోల్పోతారు. ఆ ప్రకారంగా చూస్తే ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అనర్హురాలు. ఇప్పటికే జగన్ అన్యమతస్థుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి. చట్టంలో ఉన్న సున్నితమైన అంశాలను పరిష్కారించాలంటే ఇప్పట్లో అంత సులువుగా సాధ్యం కాదు. ఈ వివాదం ముదిరితే శ్రీదేవి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా లేక దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే అంశాన్ని ముందుకు తెస్తారా..? అలా చేస్తే కొత్త వివాదాలకు ఆజ్యం పోసినట్లే… ఎం చేస్తారో వేచిచూడాలసిందే..!