Home ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలనెరవేరింది… ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి లైన్ క్లియర్

ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలనెరవేరింది… ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి లైన్ క్లియర్

284
0

అమరావతి : ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని దశాబ్దాలుగా కార్మికులు చేస్తున్న పోరాటాల కల నెరవేరబోంతోంది. ఆర్టీసీ విలీన అంశంపై నియమించిన ఆంజనేయరెడ్డి కమిటీ సీఎం వైఎస్ జగన్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలో ఆర్టీసీని విలీనం చేయాలని సిఫారసు చేశారు. సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంఛనమే కానుంది.

కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థిక మంత్రి బుగ్గన, ఆర్టీసీ, రవాణా అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేశారు. దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలనుజగన్ నెరవేర్చబోతున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నారని, ఇందుకు సంబంధించిన నిర్ణయం గురువారం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఈ విభాగంలోకి తీసుకుంటామని వివరించారు. త్వరలోనే ప్రజారవానా పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు.