Home క్రైమ్ ప‌సి బిడ్డను బలి ఇవ్వాలనుకున్నారు.. పోలీసుల జోక్యంతో బిడ్డ ప్రాణాలు కాపాడిన వైనం

ప‌సి బిడ్డను బలి ఇవ్వాలనుకున్నారు.. పోలీసుల జోక్యంతో బిడ్డ ప్రాణాలు కాపాడిన వైనం

386
0

– నిందితుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్
– చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు, స్థానికులు..
– మాంత్రికుడు, నిందితుని కుటుంబ స‌భ్యులు అరెస్ట

అసొం : మాంత్రికుడి మాటలకు అభం శుభం తెలియని చిన్నారిని బలి ఇవ్వడానికి సిద్ద‌మైంది ఓ కుటుంబం. మాంత్రికుడు చిన్నారిపై క్షుద్ర పూజలు చేసి, సరిగ్గా కత్తితో బలి ఇచ్చే సమయానికి పోలీసులు రావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన అసోంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఉదాల్‌ గుడి జిల్లా గనక్‌ పారా గ్రామంలోని ఓ టీచర్ కుటుంబంలో మూడేళ్ల క్రితం ఓ చిన్నారి చనిపోయింది. ఆత‌ర్వాత వాళ్లు మనశ్శాంతి కోసం ఓ పూజారిని సంప్రదించారు. అప్పటి నుంచి ఇంట్లో పూజలు చేస్తున్నారు. ఆ మాంత్రికుడు ఓ చిన్నారిని లివ్వాలని చెప్పాడట..!

దీంతో ఇంట్లో వారంతా కలిసి ఆ సైన్స్‌ టీచర్‌కు దగ్గరి కుటుంబ స‌భ్య‌ల్లో ఒక‌రి కూతుర్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆ పాప తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం గమనార్హం. శనివారం ఇంట్లో నుంచి పొగ రావ‌డం, మంత్రాలు చదువుతున్న శ‌బ్దం రావడంతో స్థానికులు వెళ్లి గమనించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అలా చెయ్యొద్దని గ్రామ‌స్థులు ఎంత వారించినా.. వారు వినిపించుకోలేదు. పైగా అడ్డుకున్న వారిని చంపేస్తానంటూ ఆ క్షుద్రపూజారి బెదిరించాడు.

ఇక లాభం లేద‌నుకున్న గ్రామ‌స్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షుద్ర‌పూజ‌లు చేస్తున్న‌ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇంట్లో ఉన్నవాళ్లు పోలీసులపైకి రాళ్లతో దాడికి దిగారు. మరోమార్గం లేక పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాగానే పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే పూజారి.. చిన్నారి ముందు పెద్ద కత్తితో నిలబడి ఉండడం పోలీసుల స్వయంగా చూశారు.

వెంటనే పూజారిని అడ్డుకున్నారు. ప‌సిబిడ్డ‌ను కాపాడారు. ఆ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన జరిగిన కుటుంబంలో అందరూ విద్యావంతులే కావడం సిగ్గు చేటు. ఇంటి యజమాని సైన్స్‌ టీచర్‌ కాగా.. ఆయన భార్య నర్సుగా పనిచేస్తోంది. కుమారుడు ఎంబీఏ పూర్తి చేశాడు.