Home విద్య అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన‌ మాంటిస్సోరి కోటేశ్వ‌ర‌మ్మ

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన‌ మాంటిస్సోరి కోటేశ్వ‌ర‌మ్మ

297
0

విజయవాడ : తాను స్థాపించిన విద్యాసంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న మహిళా విద్యావేత్త మాంటిస్సోరి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కంకిపాడులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్త్రీ విద్యే పరమావధిగా విజయవాడలో విద్యాసంస్థను నెలకొల్పి ఆరు దశాబ్దాలుగా విద్యారంగంలో ఎనలేని కృషి చేశారు. ఆమె కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. కృష్ణాజిల్లా గోసాల గ్రామంలో 1925 సెప్టెంబరు 15న జన్మించారు. విద్యావేత్తగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. 1971లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ అవార్డు, 1980లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రీయ విద్యాసరస్వతి పురస్కారం, లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ వంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. విద్యారంగానికి ఎనలేని కృషి చేసిన కోటేశ్వరమ్మ మృతి పట్ల పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.