Home ఆంధ్రప్రదేశ్ దేశానికి రాజైనా… అమ్మకు మాత్రం కొడుకే…

దేశానికి రాజైనా… అమ్మకు మాత్రం కొడుకే…

534
0

విజయవాడ : ఢిల్లీకి రాజు అయినా… రాష్ట్రానికి రాజైనా అమ్మకు మాత్రం కొడుకే. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి దగ్గర మాత్రం బిడ్డే. కుమారుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తొలి ప్రసంగం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఆమె సంతోషంతో ఆనందభాష్పాలు రాల్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్‌ను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లిని అక్కున చేర్చుకుని, కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. ఈ దృశ్యం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అందరినీ కదలించివేసింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.