అమరావతి : ఈ నెల 30న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారూ. జగన్‌తో పాటుగా మొత్తం కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుందని తొలుత భావించారు. ఆ తరువాత జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం సీఎంతో పాటుగా తొమ్మది మంది బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పుష్పశ్రీ వాణి, బొత్సా సత్య నారాయణ, ధర్మాన ప్రసాదరావు, గ్రంధి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అవంతి శ్రీనివాస్ పేర్లు జగంతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వినిపిస్తున్నాయి.
త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు జోష్ తగ్గక ముందే ఈ ఎన్నికలు ముగించాలనేది జగన్ అంచనా. అందులో సమర్దవంతంగా బాధ్యతలు నిర్వహించిన వారిలో ఎంపిక చేసి మంత్రివర్గం పూర్తి స్తాయిలో విస్తరించాలని నిర్ణియంచినట్లు సమాచారం. ప్రాటెం స్పీకర్‌గా ఆ ముగ్గురులో ఒకరు. ఇక కొత్తగా శానసభ కొలువు తీరాల్సి ఉంది. దీని కోసం ఈ రోజు సాయంత్రం అధికారిక గజెట్ విడుదల కానుంది. దీంతో కొత్త శాసనసభ జూన్ మొదటి వారంలో కొలువు తీరనుంది. ఇందు కోసం శనివారం జగన్ హైదరాబాద్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో తొలి వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గురించి చర్చించినట్లు సమాచారం. ఇక జూన్ 1న ప్రొటెం స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నారు.