అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం కావాలని, గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవాలని ఆదివారం కృష్ణాజిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు అట్లూరి శశికాంత్(శశి) ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ వద్ద గల వినాయకుడి గుడి నుండి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వరకు పాదయాత్రను ప్రారంభించారు. గుడివాడ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్ధి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు దేవినేని అవినాష్, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్, తెలుగు మహిళ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.