Home సినిమా వాళ్లిద్ద‌రూ వార‌సుల‌ను తెర‌పై చూసుకోకుండానే…

వాళ్లిద్ద‌రూ వార‌సుల‌ను తెర‌పై చూసుకోకుండానే…

627
0

ముంబయి : బోనీక‌పూర్ జీవితంలో ఇద్ద‌రిని వివాహం చేసుకున్నారు. మొద‌టి భార్య మోనాషౌరీ. ఆమె అర్జున్‌క‌పూర్ పుట్టిన త‌ర్వాత కొన్ని కార‌ణాల‌తో విడిపోయారు. ఆత‌ర్వాత శ్రీ‌దేవిని వివాహం చేసుకున్నారు. భ‌ర్త దూరమ‌య్యాడ‌న్న ఆవేద‌న‌తో కొన్నిరోజుల త‌ర్వాత మోనా అనారోగ్యంతో త‌నువు చాలించారు.

అప్ప‌టికే మోనాషౌరీ కుమారుడు అర్జున్ క‌పూర్ ఇష‌క్‌జాదే చిత్రంలో న‌టిస్తున్నారు. అత‌ను న‌టించిన మొద‌టి సినిమా కూడా ఇష‌క్‌జాదే. 2012మే నెల‌లో సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత‌తు అర్జున్ తల్లి మార్చ‌లోనే మ‌ర‌ణించారు. అలా బోనిక‌పూర్ మొద‌టి భార్య ఆమె కొడుకును తెర‌పై చూడ‌లేక‌పోయారు.

తాజాగా శ్రీదేవి విషయంలోనూ అలాగే జరిగింది. శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వి కపూర్‌ ప్రస్తుతం ‘ధడక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో విడుదల కావాల్సి ఉంది. త‌ల్లి శ్రీదేవి సలహాతోనే జాన్వి ఈ సినిమాకు ఒప్పుకొన్నారు. అమ్మ ఉంటేనే ధైర్యంగా షూటింగ్‌ చేస్తాననేవారు. దాంతో ఉదయం నుండి శ్రీదేవి జాన్వి కోసం సెట్‌లోనే ఉండేవారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పుడు జాన్వి అచ్చం తన తల్లిలాగే ఉన్నారంటూ అభిమానులు ట్వీట్ చేశారు. తొలి సినిమాతో జాన్వికి మంచి గుర్తింపు వస్తుందని ఎన్నోసార్లు శ్రీదేవి స్వ‌యంగా చెప్పారు. అయితే తన కూతురిని తెరపై చూసుకోకుండానే వెళ్లిపోవడం బాధాకరంమైన విష‌యం. అలా బోనీక‌పూర్ ఇద్ద‌రు భార్య‌లూ వారి వాస‌రుల‌ను తెర‌పై చూసుకోకుండానే… తిరిగిరాని లోకాల‌కు వెళ్లారు.