Home సినిమా అతిలోకసుందరి ఇక లేరు

అతిలోకసుందరి ఇక లేరు

515
0

ముంబై : బాలనీటిగా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీదేవి అతిలోకసుందరి గా యువత హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి గుండె పోటుతో కన్ను మూశారు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న దిగ్గజ నటి శ్రీదేవి ఇక లేరు. అతిలోక సుందరిగా అందరి మన్ననలు పొందిన శ్రీదేవి కన్నుమూశారు. శనివారం అర్థరాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది. ఆమె తుది శ్వాస విడిచిన సమయంలో శ్రీదేవి చెంత భర్త భోనికపూర్, కుమార్తె ఖుషి ఉన్నారని సమాచారం. 54 ఏళ్ల శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు ఆమె మరిది సంజయ్ కపూర్ ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే అనేకమంది ముంబైలోని శ్రీదేవి ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడే ఉన్న ఆమె కుమార్తె జాహ్నవిని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.

ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె కుటుంబంతో దుబాయి వెళ్లారు. అర్ధరాత్రి ఆమె గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్దారించినట్లు తెలిసింది. “శ్రీదేవి ఇక లేరు. నేను దుబాయి నుంచి ఇప్పుడే వచ్చాను. కానీ వెంటనే తిరిగి దుబాయి వెళ్తున్నాను. రాత్రి 11… 11:30 సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంతకు మించి నాకు వివరాలు తెలియవు’” అని సంజయ్ కపూర్ జాతీయ మీడియాతో తెలిపారు.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో శ్రీదేవి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వత హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి అక్కడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. బాల నటిగా నట జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి దేశంలోనే ఒక పెద్ద తారగా ఎదిగారు. భారత ప్రభుత్వం ఆమెకు 2013లో పద్మశ్రీ పురస్కార అందజేశారు.