Home ప్రకాశం బిసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యతిరావు పూలే వర్దంతి సందర్భంగా దుప్పట్లు పంపిణీ

బిసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యతిరావు పూలే వర్దంతి సందర్భంగా దుప్పట్లు పంపిణీ

589
0

చీరాల : మహాత్మా జ్యోతిరావు పూలే128 వ వర్ధంతి సందర్భంగా గడియార స్తంభం సెంటర్లోని పూలే విగ్రహానికి బిసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిసి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వైద్యులు, హైమా హాస్పటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహోన్నత ఉద్యమ ప్రదాతగా, అమానుషమైన కుల వ్యవస్థను రూపుమాపటానికి, కుల వ్యస్వస్థను కూల్చడానికి అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. “థామస్ పెయిన్” వ్రాసిన “రైట్స్ ఆఫ్ మ్యాన్” పుస్తక ప్రభావంతో కుల వ్యవస్థ, అంటరాని తనం మీద “గులాంగిరి” అనే గ్రంధాని రచించి ఉద్యమించిన ఓక శక్తి జ్యోతిరావ్ పూలే అన్నారు. బడుగుల హాక్కుల కోసం పోరాడిన మహా మనిషని పూలే అన్నారు.

అనంతరం బిసి ఫెడరేషన్ అద్వర్యంలో సుమారు వంద మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పూలే వంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో బిసి రాష్ట్ర నాయకులు వూటుకూరి వెంకటేశ్వర్లు, మస్తాన్ రావు, కామాక్షి హాస్పిటల్స్ అధినేత తాడివలస దేవరాజు, వైసిపి చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరక సురేంద్ర, సత్యం, బిసి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.