Home ప్రకాశం కొనసాగుతున్న వైసిపి రిలేదీక్షలు

కొనసాగుతున్న వైసిపి రిలేదీక్షలు

345
0

చీరాల : విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్న ఘటనపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని కోరుతూ డాక్టర్ వరికూటి అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. కూరగాయల మార్కెట్ సెంటర్లో రెండోరోజు దీక్షలో కొత్తపేట మాజీసర్పంచ్ చుండూరు వాసు, ఎన్ రాజకుమార్, పేర్లి నాని కూర్చొన్నారు.

దీక్షలనుద్దేశించి వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, బిసి అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడారు. ప్రతిపక్ష నేత కు రక్షణ కల్పించలేని ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచుకునేందుకు గాయపడి చికిత్స పొందుతున్న జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జగన్ పై దాడి ఘటనను సిట్టింగ్ జడ్జ్ తో లేక సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పొదిలి ఐస్వామి పాల్గొన్నారు.