Home ప్రకాశం ఛత్తీస్ఘడ్ ప్రమాద బాధితులను ఆదుకోవాలని వినతి

ఛత్తీస్ఘడ్ ప్రమాద బాధితులను ఆదుకోవాలని వినతి

493
0

ఒంగోలు : కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, మర్రిపూడి మండలాల నుండి కూలిపనులకు ఛత్తీస్ఘడ్ కు వలస వెళ్లిన కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. మృతి చెందిన కూలీల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ వంజా భక్తవత్సలం ఆధ్వర్యంలో కనిగిరి, కొండపీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, లీడ్ కప్ ఛైర్మన్ గుడూరి ఎరిక్షన్ బాంబులను కలిసి వినతి పత్రాలు అందజేశారు.

మృతదేహాలను స్వగ్రామలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చంద్రన్న భీమా పధకం వర్తింపజేయాలని కోరారు. జిల్లా నుండి ఉపాధి కోసం వలసవెళ్లే కూలీలా రక్షణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు వెలుగొండయ్యా ఉన్నారు.