ఒంగోలు : ఎస్‌సి, ఎస్‌టిలను పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని ఎన్ఎస్ఐసి విజయవాడ రీజియన్ బ్రాంచ్ మేనేజర్ రామారావు చెప్పారు. అందుకోసం జాతీయ చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య వివిధ అంశాలపై అవగాహన, సహకారం అందిస్తుందన్నారు. తొలిదశలో అవగాహన, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్ పాలసీ అమలులో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల లూధియానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ప్రారంభించినబడిన నేషనల్ ఎస్‌సి, ఎస్‌టి హబ్ ఇందుకు అవసరమైన ఆర్ధిక సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. సదస్సుకు ఎపిఎస్ఎఫ్‌సి ఒంగోలు సీనియర్ బ్రాంచి మేనేజర్ పి కమలాకరరావు అధ్యక్షత వహించారు. ఎస్ఎఫ్‌సి ద్వారా చిన్న, మద్యతరహా పరిశ్రమలకు తమ సంస్థ ఆర్ధిక సహకారం అందిస్తుందని చెప్పారు. పవర్‌పయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఎఫ్‌సి సమాచారాన్ని వివరించారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ రాయితీల విషయంలో ఎస్‌సి, ఎస్‌టిలకు ఎలాంటి జాప్యం లేకుండా తమశాఖ అందిస్తుందన్నారు. అంతేకాకుండా ఎలాంటి పరిశ్రమ స్థాపించినా రాయితీలో మినహాయింపు లేదనా్నరు. జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్టాండప్ ఇండియా, పిఎంఇజిపి కార్యక్రమాల ద్వారా ఈ సౌకర్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఎపిఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు మాట్లాడుతూ తాము నిర్వహించే పారిశ్రామిక వాడలలో ఎస్సి, ఎస్‌టిలకు కేటాయింపులో రిజర్వేషన్లతోపాటు రూ.20లక్షల వరకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. డిక్కీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఎ ఆశీర్వాదం, రాష్ట్ర కోఆర్డినేటర్ వంజా బక్తవత్సలం మాట్లాడుతూ బ్యాంకు రుణాల సమస్యలను అధిగమించేందుకు డిక్కీ జాతీయ నాయకత్వం పలు బ్యాంకులతో ఎంఒయు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో కలెక్టర్ వినయ్‌చంద్ సహకారంతో రూ.15కోట్ల రాయితీలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు నరసింహారావు, హరిప్రసాద్ అనుభవాలు వివరించారు. మోటివేటర్ సతీష్ వ్యక్తిత్వ వికాసంపై వివరించారు. ఎస్ఎఫ్‌సి మేనేజర్ మదన్‌మోహన్, టిపిఒ జాన్సన్ పాల్గొన్నారు.