చీరాల : విద్యార్ధులు చదువులతోపాటు సామాజిక సేవారంగాల్లోనూ ముందుండాలని చీరాల ఇంజనీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ల అశోక్‌కుమార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కళాశాల ఎన్‌సిసి విభాగం విద్యార్ధులు శుక్రవారం రామాపురం బీచ్‌లో కోస్టల్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం చేసిన గణేషుని విగ్రహాల వ్యర్ధాలతో అపరిశుబ్రంగా ఉన్న సముద్ర తీరాన్ని ఎన్‌సిసి విద్యార్ధులు పరిశుబ్రం చేశారు. 23వ ఆంద్రా బెటాలియన్ లెప్టినెంట్ కల్నల్ ఆర్ శ్రీనివాస్ ఆదేశాలతో తీరంలోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్ వ్యర్ధాలతోపాటు పిచ్చి మొక్కలను తొలగించారు. బహిరంగ మలవిసర్జన చేయకూడదని, పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్ సురేష్‌బాబు, ఎన్ సిసి అధికారి పి శ్రీధర్ పాల్గొన్నారు.