ఇంటర్నెట్ డెస్క్ : తెల్లారేసరికి కన్నుకొట్టి స్టార్డమ్ కొట్టేసిన కేరళకుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్.. పరిచయం చేయనవసరంలేని పేరు. మొదటి చిత్రం ఒరు అదార్ లవ్ విడుదల కాకముందే తన జీవితానికి సరిపడు క్రేజ్‌ని సంపాదించుకుంది. చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పోవి’ పాటకు ఆమె పలికించిన హావభావాలు ఎవ్వరూ మర్చిపోలేరు. ఓసారి కన్ను కొట్టి… మరోసారి గన్నుతో కన్నుగీటి… అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది అందాల కుట్టి.
ప్రియవారియార్ తనదైన స్టైల్లో మరోసారి యువతను, ప్రేక్షకులను మాయ చేసేసింది. ‘ఒరు అదార్ లవ్’లోని ‘ఫ్రీక్ పెన్న’ అంటూ రెండో పాటను ఇటీవలే విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఈ పాట వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే దీన్ని సుమారు 58లక్షల మంది వీక్షించారు.
అయితే ఈ పాటలో ప్రియ అభినయం బాగున్నప్పటికీ ఈ పాట పట్ల నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాహిత్యం పట్ల సరైన శ్రద్ధ చూపలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ పాటను 70వేలమంది లైక్ కొట్టారు. కానీ అంతకు ఆరు రెట్లు ఎక్కువగా డిస్‌లైక్స్ చేశారు. ప్రియా మొదటి సినిమాలోని మొదటి పాట బంపర్ హిట్ కొడితే రెండో పాట మాత్రం బాగాలేదని… లిరిక్స్ అర్థం కావడం లేదనే కామెట్లు నెటిజన్ల నుండి వస్తున్నాయి.
ఒకవర్గం వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా ‘మాణిక్య మలరాయ పోవి’ పాట ఉందని ప్రియవారియర్పై కొందరు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కోర్టు వివాదం నుండి ప్రియకు ఊరట లభించింది. కేసు వేసిన వాళ్లను కోర్టు చివాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఈచిత్రాన్ని వచ్చే క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాకు జోడీగా రోషన్ అబ్దుల్ రహూఫ్ నటించారు. ఒమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు.