Home ఆధ్యాత్మికం పర్యావరణం కాపాడుకునేందుకు మట్టిగణపతి మోరియా

పర్యావరణం కాపాడుకునేందుకు మట్టిగణపతి మోరియా

352
0

చీరాల : పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని రోటరీ క్లబ్‌ ప్రతినిధులు కోరారు. ‘రంగు రంగుల వినాయకులు వద్దు.. మట్టి గణనాథులే ముద్దు’ అన్న నినాదం ప్రజల్లో చొచ్చుకెళ్లేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ‘మట్టితో చేసిన గణపతులనే పూజించుకుందాం.. మన నీటి వనరులను పరిరక్షించుకుందాం’ అంటూ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి ప్రతిమలతో కాకుండా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు.

రసాయన పదార్థాలు నిండిన వీటిని వినియోగించడంతో మానవాళితో పాటు జలచరాలకు ముప్పు వాటిల్లుతోంది.  తయారు చేసేవారితో పాటు, నిమజ్జనం చేయటం వల్ల జల కాలుష్యం పెరిగి పలు అనర్థాల తలెత్తుతున్నాయి. ఆర్బాటాలకు పోయి భావితరాలకు మంచి గాలి, స్వచ్ఛమైన నీరు లేకుండా చేసేకన్న మట్టి ప్రతిమలతో పండుగ జరుపు కోవడంతో కొంతైనా మేలు చేసిన వారవుతారని చెప్పారు. కార్యక్రమంలో గీత ట్రస్ట్ చైర్మన్ వలివేటి మురళీకృష్ణ, న్యాయవాది బందారుపల్లి హేమంత్ కుమార్, శివాంజనేయ ప్రసాద్, ముద్దన రఘు, పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.