ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ సమర్థవంతంగా అమలుచేశారు. పధకం అమలులో కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ ఠాగూర్, సహాయ మంత్రి రామ్ కిషోర్ చేతుల మీదగా కలెక్టర్ అవార్డు అందుకున్నారు. మన జిల్లా కలెక్టర్ వినయ్ చందుకు కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య శుభాకాంక్షలు తెలిపారు.