Home ఆంధ్రప్రదేశ్ లీటరుకు రూ.2తగ్గిస్తూ చంద్రబాబు నిర్ణయం…!

లీటరుకు రూ.2తగ్గిస్తూ చంద్రబాబు నిర్ణయం…!

626
0

అమరావతి : ఎపి సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా విపక్షాలు సోమవారం రోజు భారత్ బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. టిడిపి అధికారంలో ఉన్నప్పటికీ బందుకు మద్దతు పలికింది. టీడీపీ అధిష్టానం ఆదేశంతో ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

చంద్రబాబు వాహనదారులకు శుభవార్త చెప్పారు. పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు రూ.2 తగ్గించాలని నిర్ణయించారు. ఈ రాయితీతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. భారత్ బంద్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చమురు ధరలపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.