Home ప్రకాశం వామ‌ప‌క్షాల రాజ‌కీయ ప్ర‌త్యామ్న‌య వేదిక గ‌ర్జ‌న‌కు త‌ర‌లి రావాలి : బ‌డుగు

వామ‌ప‌క్షాల రాజ‌కీయ ప్ర‌త్యామ్న‌య వేదిక గ‌ర్జ‌న‌కు త‌ర‌లి రావాలి : బ‌డుగు

304
0

హ‌నుమంతునిపాడు : సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌వాడ‌లో జ‌రిగే నూత‌న రాజ‌కీయ ప్ర‌త్యామ్న‌య స‌ద‌స్సుకు ప్ర‌జ‌లు పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లి రావాల‌ని సిపిఎం ప్రాంతీయ క‌మిటి క‌న్వీన‌ర్ బ‌డుగు వెంక‌టేశ్వ‌ర్లు కోరారు. కాంగ్రెష్‌, బిజెపి, టిడిపి, వైసిపి పార్టీలు వేరైనా ఒకే విధానాల‌ను పేర్లు మార్చి అమ‌లు చేస్తూ ప్ర‌జాస‌మ‌స్య‌లు గాలికొదిలి ప్ర‌జ‌ల సొమ్మ‌ను కాజేస్తున్నార‌ని ఆరోపించారు. కార్పోరేట్ కంపెనీల‌కు వేల‌కోట్ల రాయితీలు ఇస్తూ ప్ర‌జాసంక్షేమానికి నిధులు కోరితే స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని పేర్కొన్నారు. అందుకే ప్ర‌త్యామ్న‌య రాజ‌కీయ విధానాల‌తో వామ‌ప‌క్ష పార్టీలు నూత‌న రాజ‌కీయ వేదిక కోసం చేస్తున్న ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌రు కావాల‌ని కోరారు. ఈసంద‌ర్భంగా గోడ‌ప‌త్రిక ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో రాయ‌ళ్ల మాల‌కొండ‌య్య‌, వై ఏలియా, రాజ‌శేఖ‌ర్‌, నాగ‌య్య‌, ఖాశీంవ‌లి పాల్గొన్నారు.