Home గుంటూరు జ‌న‌నేత‌కు ఘ‌న నివాళి

జ‌న‌నేత‌కు ఘ‌న నివాళి

978
0

ప్ర‌కాశం : జ‌నహృద‌య నేత డాక్ట‌ర్ వైఎస్ఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘన నివాళుల‌ర్పించారు. ఒంగోలు ప‌ట్ట‌ణంలో వైసిపి జిల్లా అధ్య‌క్షులు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం ఏర్పాటు చేశారు. శిభిరాన్ని బాలినేని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా బాలినేని బాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా లేకున్నా ఆయ‌న చూపిన సంక్షేమ మార్గం ఉంద‌ని చెప్పారు. పేద‌ల‌కు జ‌బ్బు చేస్తే వైద్యం చేయించుకోల‌మ‌న్న భ‌యం లేని రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని చెప్పారు.

చీరాల : వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైసిపి ఇన్‌ఛార్జి య‌డం బాలాజీ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బొనిగ‌ల జైస‌న్‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వైసిపి కార్య‌క‌ర్త‌లు గ‌డియార స్థంభం సెంట‌ర్‌లోని వైఎస్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప్ర‌భుత్వ ఏరియా వైద్య‌శాల‌లో రోగుల‌కు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో వైసిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొండ్రు బాబ్జి, మున్సిప‌ల్ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు బుర‌ద‌గుంట ఆశ్వీర్వాదం, వైస్‌ఛైర్మ‌న్ కొరబండి సురేష్‌, ఇతర నాయ‌కులు పాల్గొన్నారు.

కొండేపి : కట్టవారిపాలెంలో వైఎస్ఆర్‌ 9వ వర్ధంతి సంద‌ర్భంగా వైసిపి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వ‌హించారు. రావెల వెంకయ్య కుమారుడు రావెల కోటేశ్వరరావు, బొక్కిసం ఉపేంద్ర, వైస్సార్సీపీ రాష్ట్ర నాయకులు డాకా పిట్చిరెడ్డి, కొండపి మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఆరికట్ల వెంకటేశ్వర్లుతోపాటు మ‌రో నాలుగు మండలాల అధ్యక్షులు, భారీ స్థాయిలో కార్యకర్తలు హాజ‌ర‌య్యారు.

సంతనూతలపాడు : పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేశారు. కార్య‌క్ర‌మంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త టిజెఆర్‌ సుధాకర్ బాబు పాల్గొన్నారు. మద్దిపాడు మండలం మల్లవరంలో వైఎస్ఆర్‌కు ఘన నివాళి అర్పించారు.

చీమ‌కుర్తి : వైఎస్ఆర్‌సిపి ఆధ్వ‌ర్యంలో చీమకుర్తిలో వైఎస్ఆర్‌కు ఘన నివాళి అర్పించిన అనంత‌రం వైసిపి నాయ‌కులు, దర్శి మాజీ ఎంఎల్ఎ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టిజెఆర్‌ సుధాకర్ బాబు గారు మాట్లాడారు.

బాప‌ట్ల : దివంగత ముఖ్యమంత్రి డాక్ట‌ర్‌ వై.ఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్ఆర్‌ విగ్రహాల వద్ద నివాళి అర్పించారు. అనంత‌రం అన్న‌దానం చేశారు. కార్య‌క్ర‌మంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడారు.