Home క్రైమ్ కామం క‌ళ్లు మూసింది… ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా

కామం క‌ళ్లు మూసింది… ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా

609
0

హైదరాబాద్ : క‌న్న తండ్రే. కానీ తాగితే తానేమి చేస్తున్నాడో త‌న‌కే తెలియ‌ద‌ట‌. అంతే ఏడాది కాలంగా ఇద్ద‌రు కూతుళ్ల‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఏడాదికాలంగా అనేక‌సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాగిన మైకంలో పశువులా ప్రవర్తించేవాడు. అతడి వికృతచేష్టలతో విసిగివేసారిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దారుణం వెలుగుచూసింది. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ స్టేష‌న్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి (40) కుటుంబంతోసహా కొన్నేళ్ల‌ క్రితమే బిహార్‌కు వచ్చాడు. బీహార్ నుండి బతుకుదెరువు కోసం హైద‌రాబాద్ నగరానికి వచ్చి టోలిచౌకీలో కొంత‌కాలంగా ఉన్నాడు. అక్క‌డి నుండి ఆరు నెలల క్రితం శంషాబాద్‌కు మకాం మార్చుకున్నాడు. కాపలాదారుగా పనిచేస్తుంటాడు. అతనికి భార్యతోపాటు 17, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

మద్యం తాగితే ప‌శువులా ప్ర‌వ‌ర్తించేవాడు. కూతుళ్లతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. కూతుళ్ల‌పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. టోలిచౌక్‌లో ఉన్నప్పటి నుండే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని బాధితులు పోలీసుల‌కు వివ‌రించారు. త‌మ‌పై తండ్రి చేస్తున్న‌ దారుణం గురించి కుమార్తెలు తల్లికి చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. అతడి నిర్వాకం నిజమేనని తేలుసుకుని గొడవ చేసింది. భర్తను బిహార్‌కు పంపించింది. కొద్దిరోజులు అక్కడే ఉన్న కామాంధుడు బుద్ధిగా ఉంటానని నమ్మబలికాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. అయినప్ప‌టికీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బాధితురాళ్ల తల్లి ఐదు రోజుల క్రితం ఆర్‌జీఐఏ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాళ్లు చెప్ప‌డంతో పోలీసులు నివ్వెర‌బోయారు. నిందితుణ్ని అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చారు. కోర్టు ఆదేశాల‌తో బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.