Home క్రైమ్ ఆర్టీసీ డ్రెవర్ చొరవతో తప్పిన ప్రమాదం

ఆర్టీసీ డ్రెవర్ చొరవతో తప్పిన ప్రమాదం

452
0

బాప‌ట్ల : ఎదురుగా బైకు వ‌స్తుంది. అదీ అదుపుత‌ప్పి అడ్డంగా వ‌స్తుండ‌టంతో ప్ర‌మాదాన్ని ముందుగా గ‌మ‌నించిన ఆర్టీసీ డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తం అయ్యాడు. బైకును త‌ప్పించి బ‌స్సును రోడ్డుప‌క్క‌కు దింపాడు. అంతే పెద్ద ప్ర‌మాద‌మైతే త‌ప్పింది. కానీ బ‌స్సు ముళ్ల‌పొద‌ల్లోకి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గుంటూరు నుండి బాపట్ల వైపు వస్తున్నఆర్టీసీ బస్సుకు బాపట్ల వైపు నుండి గుంటూరు వైపు వెళుతున్న బైక్ ఒక్క సారిగా అడ్డంగా వ‌చ్చింది. వెంట‌నే ఆర్టీసీ డ్రెవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును ముళ్లపొదలలోకి పోనిచ్చాడు. అంతే బైకును ప్ర‌మాదం నుండి త‌ప్పించాడు. అయితే ఆ స‌మ‌యంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రెవర్, కండక్టర్, ప్ర‌యాణికులు ఎవ్వ‌రికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఉన్నతాధికారులు సైతం ఊఇరిపిల్చికున్నారు.