Home ఆంధ్రప్రదేశ్ రానున్న ఎన్నికల్లో యాదవులు ఐఖ్యంగా ఉండాలి : మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు

రానున్న ఎన్నికల్లో యాదవులు ఐఖ్యంగా ఉండాలి : మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు

694
0

ఒంగోలు : రానున్న ఎన్నుకల్లో యాదవ అభ్యర్థుల గెలుపుకు యాదవులు ఐఖ్యంగా ఉండాలని మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు కోరారు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత విద్యాసంవత్సర పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

రెండు పార్టీల్లో యాదవ అభ్యర్థులు ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒక్కరే యాదవ అభ్యర్థి ఉన్నప్పుడు మాత్రం అతని గెలుపుకు ఐఖ్యం కావాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి కేటాయింపు చేస్తున్న పరిస్థితులు చేస్తున్నామన్నారు. యడవులకు కనిగిరి, చీరాల నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు అవకాశం ఇచ్చేందుకు వీలుండన్నారు. కనిగిరిలో గతంలో మద్దినేని ప్రభాకరరావు, గత ఎన్నికల్లో బుర్రా మధుసూదనరావు యాదవ్ వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేశారని చెప్పారు.

చిరాలలోను తనతోపాటు చిమాట సాంబ శాసనసభకు, బాపట్ల పార్లమెంట్ కు ఎన్నికయ్యారని చెప్పారు. అయితే గత రెండు దఫాలుగా జిల్లానుండి యాదవ సామాజిక వర్గానికి పార్టీలు అవకాశం ఇచ్చినప్పటికీ గెలిపించుకోలేని అనైక్యత పరిస్థితులు యడవులకు ప్రాతినిధ్యం లేకుండా చేశామన్నారు.

అనంతరం యాదవ ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సభలో యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధులు, యాదవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.