Home ప్రకాశం మార్క్సిజం – సమకాలీన ప్రపంచం అంశంపై సదస్సు

మార్క్సిజం – సమకాలీన ప్రపంచం అంశంపై సదస్సు

649
0

చీరాల : మార్స్కిజం – సమకాలీన ప్రపంచం అంశంపై గుంటూరు మాజీ ఎంఎల్సి ప్రొఫెసర్ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. విద్యా కాలేజీ సెమినార్ హాల్లో ప్రోగ్రాసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ…. 1818మే 5న కారల్ మార్క్స్ జన్మించారు. ఇప్పటికి 200సంవత్సరాలు అయ్యింది. ఆయన లండన్లో చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన వద్ద కేవలం 13మంది మాత్రమే ఇన్నారు.కానీ నేడు ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది మార్క్స్ జయంతిని జరుపుకుంటున్నాము. ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది. ప్రపంచాన్ని విశ్లేషించడంలో, కార్మికుల సమస్యలు, ఆర్ధిక పరిస్థితులను ఆయన 30ఏళ్ల వయస్సులో కమ్యూనిస్టు మేనిఫెస్టోలో రాశారు. 1867లో దాస్ కాపిటల్ రాశారు. బైబిల్ తర్వాత అత్యధికంగా ప్రచురించిన పుస్తకం కమ్యూనిస్టు మేనిఫెస్టో మాత్రమే.

జంతువుల జీవితాల్లో మారులేమి లేవు. కానీ మనిషి జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుని సంపదను సృష్టించే శక్తి మనిషికి ఉంది కాబట్టే మిగిలిన జంతువులకన్నా భిన్నంగా ఉన్నాడు. ప్రతి అవసరంలోను మానవ శ్రమతో ఇమిడి ఉంది. తత్వశాస్త్రం, సామ్యవాదం, అర్ధశాస్త్రం కలిపి సమాజానికి మార్క్స్ అన్వయించి రూపొందించినదే మార్క్సిజం. మానవ శ్రమ ఆధారంగానే వస్తువు విలువ ఆధారపడి ఉంటుంది. అలాంటి శ్రమ కార్మికుడి కాకుండా పెట్టుబడి దారునికి చెందడం అంటే శ్రమ దోపిడీ జరుగుతుంది. ఈ సూత్రాన్ని సమాజానికి అన్వయించారు.

ఆదిమ కాలంలో దోపిడీ లేదు. బానిస సమాజంలో దోపిడీ మొదలైంది. భూస్వామ్య వ్యవస్థలో భూస్వాములు దోపిడీ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి చెందాక పారిశ్రామిక వేత్తలు దోపిడీ చేస్తున్నారు. మార్క్సిజం గ్రంధం కాదు అదొక సైన్సు. దీని ఆధారంగానే పారిస్ కమ్యూన్ అవతరించింది. 1916లో రష్యా విప్లవం లెనిన్ నాయకత్వంలో జయప్రదమైనది. 1948లో మావో నాయకత్వంలో చైనాలో సోషలిస్టు ప్రభుత్వాలు అవతరించాయి. పెట్టుబడిదారీ వ్యవస్థను సోషలిస్టు వ్యవస్థ సవాలు చేసింది.

1980లో గోర్భచెవ్ సంస్కరణలు అమలు చేశారు. 1991నాటికి సోషలిజం కూలిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నిరుత్సాహం ఆవహించింది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం మార్క్సిజం, సోషలిజం అజేయంగా ఉంటుందని ఇటీవల ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు చూస్తున్నాం.

గ్లోబలైజేషన్ పేరుతో అమలవుతున్న విధానాలు ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరుగుతున్నాముయి. సోవియట్ యూనియన్ కూలీనంత మాత్రాన సోషలిజం, మార్క్సిజం కులినట్లు కాదు. సోషలిజం అమలు చేయడంలో వైఫల్యం మాత్రమే. సోషలిజం కులైనంతమాత్రాన ప్రజల అవసరాలన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ తీర్చగలిగిందా? అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో సంక్షోభం కొనసాగుతుంది. దోపిడీ ఉన్నంతకాలం మార్క్స్, సోషలిజం సజీవంగా ఉంటాయి.

సదస్సుకు జేవివి నాయకులు డి నారపరెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో విద్యా సంస్థల ఛైర్మన్ ఎన్ ప్రకాశరావు, విశ్రాంత ఎమ్ఈఓ జంగా మోహనరావు, జేవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు పాల్గొన్నారు.