Home జాతీయం దేశం విడిచే రుణ ఎగ‌వేత దారుల‌కు క‌ళ్లెం

దేశం విడిచే రుణ ఎగ‌వేత దారుల‌కు క‌ళ్లెం

421
0

న్యూఢిల్లీ (ఇంట‌ర్‌నెట్‌) : బ్యాంకుల్లో వేల‌ కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేయడం ఇప్పుడు భారత‌ దర్యాప్తు సంస్థలకు త‌ల‌నొప్పిగా మారింది. విదేశాల‌కు ఎగిరిపోయి విచార‌ణ‌కు సహకరించకుండా ఉండ‌టం రుణ ఎగవేతదారులు చేస్తున్న పన్నాగాలు. ఇలాంటి వారిని నియ‌త్రించేందుకు కొత్త‌మార్గ‌ద‌ర్శకాల‌ను కేంద్రం రూపొందిస్తుంది. రూ.50 కోట్లకు పైన రుణాలు తీసుకున్న వాళ్లు విదేశాల‌కు పారిపోకుండా వాలళ్ల‌ రెక్కలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ద‌మైంది.

ఈపాటికే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవాళ్ల‌ బినామీ ఆస్తులతో సహా జప్తు చేసేందుకు కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటైన‌ కమిటీ తాజా ప్రతిపాదనలు రూపొందించింది. దేశీయ పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్ 10కి సవరణ చేయాలని ప్రతిపాదించింది. పరిమితికి మించి ఎవరైతే రుణాలు ఉద్దేశ్యపూర్వక ఎగవేస్తారో వారివ‌ల్ల‌ ప్రజా ప్రయోజనాలకు ఎకానమిక్‌, ఫైనాన్సియల్‌ ప్రమాదంగా పరిగణించాలని నిర్ణయిస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. రూ.50 కోట్ల ప‌రిమితి నిర్ణయించనున్నట్టు పేర్కొన్నారు.

పాస్‌పోర్టుల రద్దు విషయంపై కూడా సెక్షన్‌ 10 డీల్స్‌ చర్చిస్తున్నామని తెలిపారు. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్టు వివరాలు అందించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ కమిటీలో ఆర్‌బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్‌బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోదీతో, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు వెళ్లి అసలు భారత్‌కు రాక‌పోవ‌డంతో వారిపై విచార‌ణ క‌ష్ట‌మైంది. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్‌పీఏ అకౌంట్ల‌పై విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది.