Home క్రైమ్ ‘ఆధార్‌తో ఆస్తుల అనుసంధాన’ వ్యాజ్యం

‘ఆధార్‌తో ఆస్తుల అనుసంధాన’ వ్యాజ్యం

323
0

డిల్లీ : వ్యక్తుల ఆస్తుల వివరాలను వారి ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయటాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై నాలుగు వారాల తర్వాత విచారణ ప్రారంభిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ప్ర‌క‌టించింది.

అధార్‌ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో ఈ వ్యాజ్యాన్నీ కలుపుతారా అన్నది స్పష్టం చేయలేదు. కొత్తగా కొనుగోలు చేసే ఆస్తులతో పాటు ఇప్పటికే కలిగి ఉన్న ఆస్తుల వివరాలను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయటాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ దిల్లీకి చెందిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.