Home ఆంధ్రప్రదేశ్ సెప్టెంబ‌ర్ 5న ఛ‌లో పార్ల‌మెంట్ : సిఐటియు

సెప్టెంబ‌ర్ 5న ఛ‌లో పార్ల‌మెంట్ : సిఐటియు

341
0

చీరాల : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారధ్యంలోని మోడీ ప్రభుత్వం అనిసరిస్తున్న కార్మిక, రైతు విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 5న సిఐటియు, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఛలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు ఐఎల్టీడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసంశెట్టి వెంకట్రావు, ఏవి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తెలిపారు. ఫెడరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ అధికారానికి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కంపినిలు, యజమానులకు అనుకూలంగా మారుస్తూ భద్రత లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు ధరలు ప్రకటిస్తామని ఇప్పుడు నామమాత్రపు ధరలతో ప్రకటించి రైతులను మోసం చేసారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పునాధి పెంచకపోగా నిధులు కుదించి పనులు లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఐఎల్టీడి కంపినిలో బదిలీలు వెంటనే అంశలు చేయాలని కోరారు. గతంలో ఐఎన్టీయుసి అగ్రిమెంట్ చేసేటప్పుడు 160మంది కార్మికులను తగ్గిందన్నారు. అప్పటికే 200కుపైగా బదిలీ కార్మికులు ఉన్నారని చెప్పారు. వీరందరికి పనికల్పించాలని కోరారు. కార్మికుల కోసం పోరాడాల్సిన ఐఎన్టీయుసి తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజు, గోసాల సుధాకర్, సిఐటియు చీరాల డివిజన్ కార్యదర్శి ఎన్ బాబురావు, ఫెడరేషన్ నాయకులు ఎమ్ రవిచంద్ర, డేగల వెంకటేశ్వర్లు, బోయిన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.