చీరాల : ఉపాధ్యాయులు ప్రార్ధనా సమయానికి ముందే పాఠశాలకు హాజరు కావాలని ఎంఇఒ కె లక్ష్మినారాయణ ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధులకు కనీస అభ్యసన సామర్ధ్యాలు కల్పించాలన్నారు. శుక్రవారం మండలంలోని దేవినూతల, పిట్టువారిపాలెం గ్రామాల్లోని ప్రాధమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సందర్శించారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమయపాలన నేర్పించాలని అన్నారు. విద్యార్ధి అభ్యసన స్థాయిని అంచనా వేసి వారిలో కనీస సామర్ధ్యాలను పరీక్షించాలనా్నరు. నూరుశాతం పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ యాప్ ద్వారా సమాచారం పొందుపర్చాలన్నారు.